Wednesday, May 21, 2008

లోచర్ల : మా ఊరు


ఈ ఫోటో చూసారా ? ..




ఇది మా ఊరు లో చిన్న బాగం & నా జీవితం లో పెద్ద బాగం కూడాను .

ఇక్కడే నేల మీదే పుట్టాను ..

ఇక్కడే అమ్మఅని పిలవడం నేర్చుకున్న ..

ఇక్కడే నడక నేర్చుకున్నా

ఇక్కడే ఆడుకున్నాను...

ఇక్కడే నా జీవితం ప్రారంబించాను

ఎన్నో జ్ఞాపకాలు ..ఎన్నో అనుభూతులు . వాటిలో కొన్ని మీతో పంచుకుంటా ...

మీకు వినే ఓపిక వుందా ? ..కాని నేను రాసింది ..మళ్ళి నేను చదువుకుంటే ..టైం మెషిన్ లో నా బాల్యని కి మా ఊరు వెళ్ళినట్టు వుంటుంది .

అనగన గా ఒ చిన్న పల్లెటూరు .. ఊరు పేరు " లోచర్ల " .. ఇదే మా ఊరు ..

ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం అని చాలా ట్రై చేశా .. కాని ఆ విషయం తెలుసుకో లేకపోయా ..ఇంక ట్రై చేస్తున్నే వున్నా .. తెలిసినపుడు మీకు చెబుతా లెండి ..


మా ఊరులో ఎంత మంది జనాబా వుంటారో తెలీదు .కాని 2800 ఓటర్లు వున్నారు ( ఈ విషయం ఎలా తెలిసింది అనుకుంటున్నారా .. ఓసారి నేను మా ఊరు ఎలక్షన్ లో కౌంటింగ్ ఏజెంట్ గా వున్నా ...)


మా ఊరు నాలుగు వైపులా చెరువులు వున్నాయి ...అవే మా వ్యవసాయం కి ఆధారం. వర్షాలు బాగా కురిసి ..ఈ నలుగు చెరువులు నిండి అంటే .ఆ ఏడు సంక్రాంతి పండగ చాలా బాగా జరుగుతుంది ..అందుకే మేము ఎప్పుడు ఆ చెరువులు నిండాలి అని దేవుణ్ణి మొక్కుతాం .. మా ఊరు కి ఫోన్ చేసినప్డు ఈ విషయం అడుగుతా ...

మా ఊరి మర్రి చెట్టు



ఊరులో కుడా మర్రి చెట్టు వుండి ...అదే మా ఊరికి అందం ..దాన్నిమా ముత్తాత వేసారు అంటా ..అది మా చిన్నపుడు చాలా పెద్దగ వుండేది .. దీని పక్కనే నాల చెరువు వుంటుంది ...అందుకే దీని కి అంత అందం ..

దాని మీద చాలా రకాల పక్షులు లు వుండేవి ..రామ చిలకలు కుడ వుండేవి ...ఆ పక్షులు కిల కిల రావాలు నాకు ఇంకా నా చెవి లో వినిపిస్తుంటుంది ..

వేసవి సెలవలు వస్తె చాలు ..మా ఊరు పిల్ల గ్యాంగ్ అంత ఆ చెట్టు కిందే అడుకోనేవాళ్ళం. అన్నం తినదాని కి మాత్రమే ఇంటి కి వెళ్ళేవాళ్ళం . చిన్నపుడు బోలెడు ఆటలు ..పాదిలు , జీడి పిక్కల ఆట,గోలీలు ఆట,కర్ర బిళ్ళ . అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు ఇయ్యేవి ..అంత ఇన తరువాత " ఆట లో అరటి పండు " అనేవాళ్ళం . అంతః ఫ్రెండ్స్ ఇపోయేవాళ్ళం ..మళ్ళి ఆటలు మొదలు ..


మా ఊరిలో పెళ్లి ఐతే ఈ చెట్టే పెళ్లి విడిది ...మా ఊరికి వచ్చే ముందు పెళ్లి కూతురి ని ఈ చెట్టుకిందే వుంచుతారు.పెళ్లి కూతురు ని చుద్దని కి పిల్ల గ్యాంగ్ అంత పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం . పెళ్లి కొడుకు పెళ్లి వాళ్ళు బ్యాండ్ మేళం తో వచ్చి పల్లకి మీద పెళ్లి మండపం కి తీసుకు వెళ్లేవారు.మా గ్యాంగ్ ఆ పల్లకి కి తో పాటు వెళ్లి పెళ్లి చూసి వచేవాళ్ళం .ఊరి లో ఎవరి పెళ్లి ఇన ఇలానే చేసేవాళ్ళం.మా గ్యాంగ్ కి శుభ లేఖ అవసరం లేదు.

మర్రి చెట్టు అంటే నకు "సత్తి గాడు" గుర్తుకు వస్తాడు. వాడు ఆటల్లో పడ్డాడు అంటే ఆకలి వుండదు & టైం తేలేదు.వాడి అమ్మ వస్తుంది , ఈ లోపు అమ్మ ని చూసి ఎక్కడో దాక్కుంటాడు. పాపం దొరికిపోతాడు , దెబ్బలు , సత్తిగాడు కేకలు. మళ్ళి రోజు వాడి అమ్మ రావడం.వీడు దక్కోవడం,దొరికిపోయడం,అమ్మ చేతిలో దెబ్బలు తినడము..ఇది ప్రతి రోజు మాకు అలవాటు ఇపోంది. మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు సత్తిగాడు కలిసాడు. "ఏరా ఇప్పుడు ఇన టైం కి ఇంటి కి వెళుతున్నావా" అని అడిగా. నవ్వుతు "అమ్మ చేతిలో దెబ్బలు తింటే పరవాలేదు, పెళ్ళం చేతిలో దెబ్బలు తింటే పరువు పోతుంది" అందుకే టైం కి ఇంటి కి వెళుతున్న అని చెప్పాడు. వాడి కి పెళ్లి ఇంది ఇద్దరు పిల్లలు.

మా ఊరి కోనేరు

నేను పుట్టాక ముందు మా ఊరు వాళ్ళు ఈ కోనేరు నీళ్లు తాగేవారు అంట .. చాలా చిత్రం గా వుంది కదా ! ..అప్పుడు ఈ కోనేరు ని చాలా పవిత్రం గా చూసేవారు , శుభ్రం గా వుంచుకోనేవారు అంటా .. తరువాత ఊరి లో మా నాన్న హ్యాండ్ బోరేవేల్ల్స్ వేయించడం .. ఈ కోనేరు మాకు స్విమ్మింగ్ పూల్ ఇంది .. ఉదయం అంతా మర్రి చెట్టు కింద ఆడుకొని ... మద్యాన్నం ౧౨ కి కోనేరు లో స్నానం . నాఫ్రెండ్స్ అందరి కి ఈత వచ్చు ..నాకు తప్ప ...నేను ఒడ్డు న స్నానం చేసేవాడి ని .. లోపలి కి వెళ్ళడని కి ట్రై చేసేవడి ని ..కాని భయం వేసేది ...అందుకే మా ఫ్రెండ్స్ ఈత పోటీలు చూస్తూ ఒడ్డున స్నానం చేసేవాడిని.అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ నన్ను వల్ల బుజాన వేసుకొని లోపలికి తెసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ టైం లో భయం & ఆనందం రెండు వేసేది. అరటి చెట్లు తో పడవల తాయారు చేసి మమ్మలి కోనేరు లోపలికి తీసుకు వెళ్లేవారు. మా గ్యాంగ్ లో ఒక అబ్బాయ్ ఈ కోనేరు లో మునిగి చనిపోయాడు. అప్పుడు ౩ నెలలు వరకు ఈ కోనేరు లో అన్ని బంద్ చేసారు. ఎప్పుడు ఇన ఊరు వెళ్లి కోనేరు వైపు వెలితే వాడే గుర్తుకు వస్తాడు.

ఈ కోనేరు గట్టు మీద చాలా పేరంటాళ్ళు గుడులు వున్నై.



మా ఊరి పంట పొలాలు

మా ఊరి లో కాలువలు ఏమి లేవు..మీకు చెప్పగా చెరువులు నిండి తే పంటలు. కాని మా ఊరిలో అన్ని రకాల పంటలు వేస్తారు. వరి,అరటి,చెరుకు,జనుమ,అన్ని రకాల కూరగాయలు,వేరు సెనగ , మామిడి తోటలు కుడ వున్నై. డిసెంబర్ నెలలో చెరుకు వుంటుంది. మా ఊరి సంప్రదాయం ప్రకారం సంక్రాంతి వరకు చెరుకు ఎవరు తినకూడదు. సంక్రాంతి కి చెరుకు ని పితృ దేవతలు కి చూపించి అప్పుడు మేము తింటాము. మా పిల్ల గ్యాంగ్ అంత వరకు ఆగేది కాదు. సాయంత్రం పొలం లో కి వెళ్లి చెరుకు తోట మధ్య లో కి వెళ్లి కూర్చొని తినేసేవాళ్ళం. ఎవరు చుసిన ఏమి అనేవారు కాదు . ఎందుకంటె ఆ గ్యాంగ్ లో నేను కుడా వుందేవాడి ని ( మా ఊరిలో నన్ను ఎప్పుడు ప్రత్యేకంగా చూసేవారు .. అందుకే మా ఊరు అంటే నాకు అంత ఇస్తాము) . వేసవి లో పొలాల్లో ను ఎక్కువ గా తిరిగేవాళ్ళం. జమ కాయలు , మామిడి పళ్ళు , జీడి పళ్ళు . ఇంకా ఆ వాసనలు నకు గుర్తే.

వరి నాట్లు వేసేటప్పుడు రోజు అంత ఆ బురద లో అడుకోనేవాళ్ళం.అప్పుడు జలగలు పట్టుకోనేవి. మేము ఏడుస్తుంటే ఎవరో ఒకరు వచ్చి తీసేవాళ్ళు .అప్పుడు ఏడుపు అపేవాళ్ళం. ఇప్పుడు అది తలుచుకుంటే నవ్వొస్తుంది.

పొలం లో చిన్నాన్న తో బోజనం ...ఆ త్రిల్ల్ లే వేరు .

మా అన్నయ్య ( చిన్నాన్న కొడుకు ) నా కోసం అరటి చెట్టు మీద పండిన పళ్ళు దాచి ఇచేవాడు. ఆ రుచే వెరు . ఎంత డబ్బులు పెట్టిన దొరకదు.


చెప్పడం మరిచిపోయా ..మా ఊరిలే బావులు కుడ వున్నై. నిండు గా నీరు వుండేది .మా ఫ్రెండ్స్ దానిలో పైనుంచి గెంతే వారు.నిను గట్టు పట్టుకొని దిగేవాన్ని. ఇప్పుడు కుడ ఊరు వెలితే నా స్నానం బావి దగ్గర . ఈ అనుభూతులు పదిల పరుచుకోవదని కి .




మా ఊరి బడి




నేను మా ఊరిలో నాలుగో తరగతి వరకు చదువుకున్నాను. నేను ఒకటో తరగతి లో వున్నపుడు మా బడి చిన్న తాటాకుల పాక. బడి కి వెళ్లేటప్పుడు మట్టి పలక ,పుల్ల తీసుకొని వెళ్ళే వాళ్ళం. నేల మీదే కుర్చోనేవాళ్ళం. ఐరన్ పలక వుంటే అప్పుడు చాలా గొప్ప. నేను sujaana టీచర్ (అమ్మ గారు అనేవారం) పక్కన కుర్చోనేవడి ని ( నా సీట్ ప్రత్యేకం ). నేనే ఆ క్లాస్ కి లీడర్. కొన్ని రోజులు కి మా హెడ్ మాస్టర్ మనవరాలు ( హేమ లత) కుడ మా క్లాస్ లో జాయిన్ ఇంది. ఆమే కుడ నా స్పెషల్ సీట్ లో కుర్చోనేది. నాకు అల కూర్చోవడం నచ్చేది కాదు. నేను ఒక్కడినే కూర్చోవాలి అని అనుకునేవాడి ని. ఆమె కుడా అలానే అనుకునేది. ఒ రోజు నువ్వు ఇక్కడ కుర్చోవద్దు అని చెప్పింది . నేను వెళ్ళాను ..ఇన చెప్పాడాని కి నువ్వు ఎవరు అని అడిగా. నేను ఈ స్కూల్ హెడ్ మాస్టర్ మనవరాలు అంది. నాకు కోపం చాలా కోపం వచ్చింది. నువ్వు హెడ్ మాస్టర్ మనవరాలు ఐతే నేను ఈ ఊరి సర్పంచ్ కొడుకు ని అన్నా. పాపం అమ్మయి చాలా భయపడింది. తరువాత మంచి ఫ్రెండ్ ఇపాయింది. ఇప్పుడు హ్యాపీ గా పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో వుంది.




ఒకటో తరగతి లో ఒ బండోడు వుండేవాడు. వాడే శంకర్ గాడు , వీడు మా క్లాస్ లో పెద్ద విలన్.పలకలు పగలుకోట్టడం , పుల్లలు దచేయడం. వాడి ఆకారం చూసి అందరకి బయం. క్లాస్ లో వీడు ఒక్కడే నా మాట వినేవాడు కాదు. ఒ రోజు నా పలక కుడా పగలుకోట్టాడు. నేను కోపం తో విరిగిన పలకను వాడి మీదకు విసిర , పాపం అది వాడి తలకు తగిలి కన్నం పడింది. ఆ మచ్చ ఇంక వుంది.




ఒ రోజు మా హెడ్ మాస్టర్ వచ్చి కొన్ని పేర్లు చెప్పి , మీరు అంత రెండవ తరగతి కి వెళుతున్నారు అని చెప్పారు. పాపం ఆ పేర్లు లో మన శంకర్ గాడి పేరు లేదు . అక్కడితో వాడు చదువు మానేసాడు.


రెండవ తరగతి లో మాకు క్లాస్ లీడర్ కి సెలక్షన్ ఇంది . నేను , హేమలత ఇద్దరం నిల్చున్నం. క్లాస్ లో ఓట్లు అన్ని నాకే. హేమలత కుడా నాకే ఓటు వేసింది. అల రెండువ తరగతి లో కుడ నేనే లీడర్. నేను చదువు లో కుడ ముందు. అందుకే టీచర్స్ ఎవరు ఏమి అనేవారు కాదు. ఓరోజు నేను బాగా అల్లరి చేస్తున్న , పక్కనే మా హెడ్ మాస్టర్ మూడవ తరగతి కి పాఠం చెబుతున్నారు. మూడవ తరగతి లీడర్ వచ్చి నకు వార్నింగ్ ఇచ్చాడు. నేను చెప్ప ఈ స్కూల్ లో నన్ను ఎవరు ఏమి అనరు అని. నేను అల్లరి చేస్తూనే వున్నా. అప్పుడు మా హెడ్ మాస్టర్ ( గురువు గారు అనేవాళ్ళం) వచ్చి కోపం గా కర్ర తో నా చేతి మీద కొట్టారు. అదే నా మీద పడ్డ మొదటి దెబ్బ, కొద్ది సేపు ఇన తరువాత వచ్చి "అల్లరి చెయ్యడం తప్పు కధ !" అన్నారు నవ్వు తు . నాకు అప్పుడు వున్నా కోపం అంత పోయింది.


మా తిరుపతి అన్నయ్య ( పేద నాన్న కొడుకు) ఊరి లో కాన్వెంటు స్టార్ట్ చేసాడు. అతను డిగ్రీ ( గణితం) చదివాడు. ఆ కాన్వెంట్ లో మొదటి జాయిన్ ఇంది నేను, ఏడుకొండలు,గిరి,నరసింగ రావు,రాజు,భానుమతి, సునీత , సరస్వతీ ,సత్యన్నారాయణ . నేను , ఏడుకొండలు ఒక్కటే వయసు.మిగిలిన వాళ్ళు అంత మా కన్న పెద్ద. అందరంమూడవ తరగతి లో జాయిన్ ఇయ్యం. ఏడుకొండలు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. వీడి దగ్గర చాలా డబ్బులు వుండేవి. మా ఊరు లో వీడి కి కిరానా షాప్ వుండేది . వాడి అన్నయ్య కి తెలియకుండా షాప్ లో చిల్లర కొట్టేసేవాడు. వాటి తో మా ఇద్దరం చాలా కొనుక్కొనే వాళ్ళం . వీడు కులం వైస్యసు , కాని చికెన్ అంటే చాలా ఇస్తాం. మా ఇంట్లో చికెన్ వందినపుడు వీడి ని బోజనని కి పిలిచే వాడిని. అప్పుడు వాడి అమ్మకి ఈ విషయం తెలిసి ఒక రోజు అంత ఇంట్లో కి రానివ్వలేదు. పసుపు నీళ్లు మీద జల్లి అప్పుడు వాడి ని ఇంట్లో కి తీసుకు వెళ్ళింది.


ఇప్పుడు ఐతే వాడి వైఫ్ కి కుడ చికెన్ వండడం వచ్చు . కిందటి ఇయర్ మా ఊరు వెళ్లి నపుడు చికెన్ తో బోజనం పెట్టాడు .( వీడి అమ్మ ఇప్పుడు లేదు ). వీడి కొడుకు ఐతే ఎగ్ , చికెన్ లేకపోతే బోజనం చెయ్యదు. ఊరిలో బిజినెస్ చేసుకుంటూ హ్యాపీ గా వున్నాడు. వీడి కొడుకు మేము చదివిన కాన్వెంటు లో చదువుతున్నాడు. నీకు సహాయం కావాలి అంటే అడుగుర అంటే , " నువ్వు సంతోసం గా వున్నావ్ , నువ్వు నాతో కలసి చదువుకున్నావ్ అని అందరికి చెప్పుకోవడం నాకు సంతోసం , అది చాలు " అన్నాడు . వీడి కి తీలియని విషయం ఒకటి వుంది నాకంటే వీడె హ్యాపీ గా వున్నాడు ..ఎందుకంటె పుట్టిన ఊరిలో వున్నాడు ,అక్కడే సంపాదిస్తున్నాడు , వాడి కుటుంబం తో , అన్నయ్యలు , తమ్ముళ్ళు , బందువులు తో వుంటున్నాడు. ఒక మనిసి కి జీవితం లో ఇంత కన్నా ఏమి కావాలి చెప్పండి.


ఇంకా చాలా వున్నై ..చెప్పాలి అంటే ..

No comments: